‘పాస్‌పోర్ట్‌, వీసా నిబంధనలు సరళతరం’

Modi inaugurates Pravasi Bharatiya Divas   - Sakshi

వారణాసి : పాస్‌పోర్ట్‌తో పాటు వీసా నిబంధనలనూ తమ ప్రభుత్వం సరళతరం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . ఈ - వీసాతో ఎన్‌ఆర్‌ఐల విలువైన సమయం ఆదా అవుతుందని, సమస్యలనూ అధిగమించవచ్చని చెప్పారు. పీఐఓ కార్డులను ఓసీఐ కార్డులుగా మార్చేందుకూ తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ప్రపంచానికి పలు అంశాల్లో భారత్‌ నేతృత్వం వహిస్తోందని, అంతర్జాతీయ సోలార్‌ అలయన్స్‌ (ఐఎస్‌ఏ) వీటిలో ఒకటని చెప్పుకొచ్చారు.

ఈ వేదిక కేంద్రంగా ఒక ప్రపంచం, ఒక సూర్యుడు, ఒకే గ్రిడ్‌ అనే స్ఫూర్తితో మనం ముందుకెళతామని చెప్పారు. ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం 15వ ప్రవాసి భారతీయ దివస్‌ను ప్రారంభించి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు అలహాబాద్‌లో కుంభమేళాకు హాజరవడంతో పాటు, రిపబ్లిక్‌ డే వేడుకలను తిలకించేందుకు వీలుగా ఈ ఏడాది ప్రవాసి భారతీయ దివస్‌ను జనవరి 21 నుంచి 23 వరకూ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నూతన భారత్‌ ఆవిష్కరణలో భారత సంతతి పాత్రను ఈ ఏడాది సదస్సుకు ప్రధాన థీమ్‌గా ఎంపిక చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top