ఇప్పటికైనా లింగ వివక్ష మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన జాతి యావత్తుకు సందేశాన్ని ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఇప్పటికైనా లింగ వివక్ష మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆయన జాతి యావత్తుకు సందేశాన్ని ఇచ్చారు. బాలికల విషయంలో చిన్నచూపును మానుకోవాలని ఉపదేశించారు.
'చదువుల నుంచి క్రీడల వరకు ప్రతి చోట అమ్మాయిలు తమ ముద్ర వేస్తున్నారు. వారు చేస్తున్న సేవలకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నా వందనాలు. లింగ వివక్ష లేని సమాజం కోసం మనమంతా కలిసి కట్టుగా ముందుకు సాగాలి. బాలికలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్లేందుకు అవకాశాలున్న నేటి రోజుల్లో లింగం ఆధారంగా వారిపై వివక్ష చూపకుండా మనమంతా కలిసి నడవాలి' అని మోదీ చెప్పారు.