ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి | Misty morning in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి

Jan 3 2018 11:10 AM | Updated on Jan 3 2018 11:10 AM

న్యూఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది. చీకట్లు కమ్మిన ఉదయంతో ఢిల్లీ నగర ప్రజలు మేల్కొన్నారు. పొగమంచు కారణంగా 21 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయగా 59 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలు కొనసాగుతోంది. ఉదయం 5.30 గంటలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే కనిపిస్తుండగా 8.30 గంటలకు 800 మీటర్ల వరకు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటోంది. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 8.4 కాగా గరిష్ఠ ఉష్ణోగ్రత 17.7గా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement