బాలనేరస్థుడికి శిక్ష ఖరారు చేసిన జునైనల్ కోర్టు | Minor gets three years in reform home | Sakshi
Sakshi News home page

బాలనేరస్థుడికి శిక్ష ఖరారు చేసిన జునైనల్ కోర్టు

Aug 31 2013 3:59 PM | Updated on Sep 1 2017 10:19 PM

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో తొలి తీర్పును జునైనల్ కోర్టు వెలువరించింది.

ఢిల్లీ: నిర్భయ చట్ట ప్రకారం గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధింఇచి తొలి తీర్పును జునైనల్ కోర్టు శనివారం వెలువరించింది. ఓ బాలనేరస్థుడికి శిక్షను ఖరారు చేస్తూ జునైనల్ కోర్టు సంచలనం తీర్పు ప్రకటించింది.  నలుగురు యువకులు కలిసి 23 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై  కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 2012, డిసెంబర్ 16 వ తేదీన బస్సులో ప్రయాణిస్తున్నమహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిలో ఓ మైనర్ బాలుడు ఉండటంతో కేసు విచారణను  జునైనల్ కోర్టు స్వీకరించింది.

 

శిక్ష పడిన బాలుడ్ని మూడేళ్లు ప్రత్యేక హోంలో ఉంచాలంటూ మేజిస్ర్టేట్ గీతాంజలి గోయల్ ఆదేశాలు జారీ చేశారు. గత ఎనిమిది నెలలుగా జైలు జీవితం గడుపుతూ శిక్ష అనుభవిస్తున్న ఆ బాలుడి గత జూన్ లో  మేజర్ గా అర్హత సాధించాడు.   మిగతా నలుగురిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement