juvenile board
-
పిల్లలతోపాటు తల్లిదండ్రులూ కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మైనర్ డ్రైవింగ్ నిరోధంపై దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ఉల్లంఘనకు పాల్పడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు (వాహన యజమానులైతే)/వాహన యజమానిపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లను జువెనైల్ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సాధారణ కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) వీరికి పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ ‘సాక్షి’కి తెలిపారు. మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ విభాగం అధికారులు గత నెల 5 నుంచి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. శనివారం వరకు నిర్వహించిన తనిఖీల్లో 2,067 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కారని, వీరిపై కేసులు నమోదు చేశామని జోయల్ డెవిస్ పేర్కొన్నారు. వాహనాలను స్వా«దీనం చేసుకుంటున్న పోలీసులు మైనర్‌తో పాటు తల్లిదండ్రులు/వాహన యజమానిని టీటీఐకి రప్పిస్తున్నారు. అక్కడ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అభియోగపత్రాలు సిద్ధం చేసి మైనర్‌ను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయమూర్తులు మైనర్లకు సామాజిక సేవ వంటి శిక్షలు విధిస్తుండగా... తల్లిదండ్రులు/వాహన యజమానులకు భారీ జరిమానాలు వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వీరికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనంతో పాటు ఆ మైనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఏ అధికారులు పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ విభాగం వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తోంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెరి్నంగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్‌కు మాత్రం 25 ఏళ్లు నిండేవరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు. -
బాలనేరస్థుడికి శిక్ష ఖరారు చేసిన జునైనల్ కోర్టు
ఢిల్లీ: నిర్భయ చట్ట ప్రకారం గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధింఇచి తొలి తీర్పును జునైనల్ కోర్టు శనివారం వెలువరించింది. ఓ బాలనేరస్థుడికి శిక్షను ఖరారు చేస్తూ జునైనల్ కోర్టు సంచలనం తీర్పు ప్రకటించింది. నలుగురు యువకులు కలిసి 23 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 2012, డిసెంబర్ 16 వ తేదీన బస్సులో ప్రయాణిస్తున్నమహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిలో ఓ మైనర్ బాలుడు ఉండటంతో కేసు విచారణను జునైనల్ కోర్టు స్వీకరించింది. శిక్ష పడిన బాలుడ్ని మూడేళ్లు ప్రత్యేక హోంలో ఉంచాలంటూ మేజిస్ర్టేట్ గీతాంజలి గోయల్ ఆదేశాలు జారీ చేశారు. గత ఎనిమిది నెలలుగా జైలు జీవితం గడుపుతూ శిక్ష అనుభవిస్తున్న ఆ బాలుడి గత జూన్ లో మేజర్ గా అర్హత సాధించాడు. మిగతా నలుగురిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. -
'గ్యాంగ్ రేప్ కేసులో మైనర్‌కు శిక్ష ఖరారు చేయవచ్చు'
గతేడాది న్యూఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురైన నిర్భయ కేసులో నిందితుల్లో ఒక్కరైన మైనర్‌కు శిక్ష ఖరారు చేసుకోవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు జువైనల్ జస్టిస్ బోర్డును ఆదేశించింది. బాలనేరస్థుల వయస్సు నిర్ధారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది. అయితే బాల నేరస్తుల వయస్సును తగ్గించే విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుపీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ ఆరో తేదీన పార్మసీ విద్యార్థిని నిర్భయ దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారం చేసిన వారిలో మైనర్ కూడా ఉన్నారు. ఆ మైనర్ నిందితుడుపై తీర్పును జువెనైల్ జస్టిస్ బోర్డు ఈనెలాఖరుకు వాయిదా వేసింది.'బాల నేరస్థుడు' అనే పదాన్ని ఎలా అన్వయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు కావడం, అక్కడ తీర్పు త్వరలో వెలువడనుండటంతో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని బోర్డు తన తీర్పును ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు గురువారం ఆ ఆదేశాలు జారీ చేసింది.