గతేడాది న్యూఢిల్లీలో గ్యాంగ్రేప్కు గురైన నిర్భయ కేసులో నిందితుల్లో ఒక్కరైన మైనర్కు శిక్ష ఖరారు చేసుకోవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతేడాది న్యూఢిల్లీలో గ్యాంగ్రేప్కు గురైన నిర్భయ కేసులో నిందితుల్లో ఒక్కరైన మైనర్కు శిక్ష ఖరారు చేసుకోవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు జువైనల్ జస్టిస్ బోర్డును ఆదేశించింది.
బాలనేరస్థుల వయస్సు నిర్ధారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది. అయితే బాల నేరస్తుల వయస్సును తగ్గించే విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుపీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ ఆరో తేదీన పార్మసీ విద్యార్థిని నిర్భయ దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైంది.
ఆమెపై అత్యాచారం చేసిన వారిలో మైనర్ కూడా ఉన్నారు. ఆ మైనర్ నిందితుడుపై తీర్పును జువెనైల్ జస్టిస్ బోర్డు ఈనెలాఖరుకు వాయిదా వేసింది.'బాల నేరస్థుడు' అనే పదాన్ని ఎలా అన్వయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు కావడం, అక్కడ తీర్పు త్వరలో వెలువడనుండటంతో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని బోర్డు తన తీర్పును ఆగస్టు 31వ తేదీకి
వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు గురువారం ఆ ఆదేశాలు జారీ చేసింది.