‘ఆధార్‌’ లేదని సేవలు నిరాకరించొద్దు

Millions of Rural Indians May be Hit as UIDAI Ends Contract With CSC Network For Aadhaar Enrolment - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ లేదనే సాకుతో పౌరులకు అత్యవసర సేవలు నిరాకరించవద్దని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ, పరిపాలనా విభాగాలకు లేఖలు రాసింది. అత్యవసర వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, నిరుపేదలకు రేషన్‌ సరుకుల పంపిణీ వంటి వాటిని తిరస్కరించవద్దని అధికారులకు సూచించింది.

ఆధార్‌ లేని కారణంగా ప్రభుత్వ పరంగా అందించే ఎటువంటి లబ్ధినైనా నిరాకరించటానికి వీల్లేదంది. వైద్య సాయం, చికిత్స వంటి అత్యవసర సందర్భాల్లో కూడా ఆధార్‌ లేదని సేవలు నిరాకరిస్తున్నారంటూ వార్తలు రావటంపై తీవ్రంగా స్పందించింది. ఇవే నిజమైతే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంది. అన్ని సేవలను పొందే హక్కు పౌరులకుందనీ, ఎవరైనా నిరాకరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top