ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరి హత్య | maoists-kill-1 person-due-to-suspect-of-informer | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరి హత్య

Jun 27 2016 12:43 PM | Updated on Oct 9 2018 2:51 PM

పోలీసులకు తమ రహస్యాలు చేరవేస్తూ.. ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనున్ని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు.

హైదరాబాద్: పోలీసులకు తమ రహస్యాలు చేరవేస్తూ.. ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనున్ని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. సుమారు 50 మంది వరకు మావోయిస్టులు అతని ఇంటిని చుట్టుముట్టి ఇంట్లోనే దారుణంగా కాల్చిచంపారు. ఈ సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బందే పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారేహుర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బబూల్ దాస్(40) ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనే నెపంతో.. మావోయిస్టులు అతన్ని కాల్చి చంపారు. సంఘటన జరిగిన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో బీఎస్‌ఎఫ్ క్యాంప్ ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. స్థానికులు తమ భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement