సీఎంను కలిసేందుకు వచ్చి విషం తాగాడు! | Man consumes poison outside UP CMs residence | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసేందుకు వచ్చి విషం తాగాడు!

May 22 2016 11:57 AM | Updated on Oct 9 2018 5:43 PM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ నివాసం వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ నివాసం వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సీఎం అఖిలేశ్‌ను కలిసేందుకు.. లక్నోలోని ఆయన నివాసం వద్ద పడిగాపులు కాశాడు. ఎంత వేచిచూసినా అతనికి సీఎంను కలిసే అవకాశం రాలేదు. దీంతో విసిగిపోయిన అతడు తన వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు లక్నోలో సీఎం అఖిలేశ్‌ విద్యార్థుల సద్భావన యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర జమ్మూ కశ్మీర్‌ వరకు సాగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement