కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం.. | LJP Leader RamChandra Paswan Passed Away | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..

Jul 21 2019 5:03 PM | Updated on Jul 21 2019 5:10 PM

LJP Leader RamChandra Paswan Passed Away - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నాయకుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు రామచంద్ర పాశ్వాన్‌(56) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్ర పాశ్వాన్‌ నేడు రామ్‌ మనోహార్‌ లోహియా ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రామచంద్ర పాశ్వాన్‌ బిహార్‌లోని సమస్తిపూర్ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

రామచంద్ర పాశ్వాన్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవ వెల కట్టలేనిదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. రామచంద్ర పాశ్వాన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంవిలాస్‌ పాశ్వాన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement