ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి పిడుగులు పడటంతో దాదాపు12 మంది మరణించారు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి పిడుగులు పడటంతో దాదాపు12 మంది మరణించారు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఉత్తరప్రదేశ్లోని నిగోహా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు అద్దె ఇంట్లో ఉండగా, వాళ్లున్న ఇంటిమీద పిడుగు పడింది.
అనురాగ్ మిశ్రా, అనుజ్ పాండే, రాహుల్ త్రిపాఠీ.. ఇలా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా, మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా లక్నో నగరంలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లక్నోలో కనిష్ఠ ఉష్ణోగ్రత 21.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.