ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాం

Ladakh MP Jamyang Tsering Namgyal Warns China - Sakshi

సాక్షి, కశ్మీర్‌ : సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలకు తగినబుద్ధి చెప్పే రోజులు ముందులోనే ఉన్నాయని బీజేపీ లద్దాక్‌ ఎంపీ జమ్యాంగ్‌ సెరింగ్‌ నంగ్యాల్‌ అన్నారు. చైనా ఆక్రమించిన ఆక్సియాచిన్‌ ప్రాంతం కూడా భారత్‌ సరిహద్దుకు అతి సమీపంలోనే ఉందని, ఒక్కప్పుడు అది లద్దాక్‌లో భాగమేనని స్పష్టం చేశారు. భారత సైనికులు శాంతిసూత్రాన్ని చైనా ఆర్మీ చేతగానితనంగా భావిస్తోందని, వారి ఆకృత్యాలకు కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇరు దేశాల సైనికల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో నంగ్యాల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత జవాన్ల మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. (ఆయుధాలు లేకుండా సరిహద్దుల్లో ఎలా)

‘1962 నుంచి చైనా అనేకసార్లు భారత్‌పైకి దురాక్రమనకు దిగుతోంది. ఇప్పటికే మన దేశానికి చెందిన అనేక ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించింది. ప్రస్తుతం చైనా ఆధీనంలోని ఆక్సియాచిన్‌ ముమ్మాటికీ భారత భూభాగమే. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంతసులువైన అంశం కాదు. భారత సైన్యానికి అంత కష్టమైన పనికూడా కాదని అనుకుంటున్నా. చైనా ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందుతామనే నమ్మకం నాకుంది. ఎందుకుంటే 1962 నాటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో లేవు. కేంద్రంలో బలమైన, సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంతకుముందులా చైనా కయ్యానికి కాలుదువ్వడాని ఏమాత్రం అదునులేదు. లద్దాక్‌ ప్రజలు ఎప్పటికీ భారత ప్రభుత్వం, సైనికులు వెంటే ఉంటుంది’ అని సెరింగ్‌ నంగ్యాల్‌ పేర్కొన్నారు. (చైనా, భారత్‌ వ్యూహాలు ఏమిటి?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top