ఇటీవల పాకిస్థాన్ జైల్లో మృతి చెందిన భారతీయ ఖైదీ క్రిపల్ సింగ్(54) పార్థివ దేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీపసుకోవాలని ఆయన సోదరి కోరారు.
25 ఏళ్ల క్రితం గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన కృపాల్ సింగ్.. పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కృపాల్ సింగ్ కుంటుంబానికి కేజ్రీవాల్ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కృపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.