టాపర్ల స్కాం: మాజీ ఎమ్మెల్యే అరెస్టు | Kingpin of toppers muddle arrested along with wife from UP | Sakshi
Sakshi News home page

టాపర్ల స్కాం: మాజీ ఎమ్మెల్యే అరెస్టు

Jun 20 2016 10:17 AM | Updated on Jul 18 2019 2:02 PM

బిహార్ ర్యాంకుల స్కాంలో సూత్రధారి అయిన ఆ రాష్ట్ర స్కూలు పరీక్షల బోర్డు మాజీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన భార్య, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలను అరెస్టు చేశారు.

బిహార్ ర్యాంకుల స్కాంలో సూత్రధారి అయిన ఆ రాష్ట్ర స్కూలు పరీక్షల బోర్డు మాజీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్, ఆయన భార్య, జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాళ్లు వారణాసిలో ఉన్నట్లు తమకు పక్కా సమాచారం రావడంతో సిట్ బృందాన్ని పంపి అరెస్టు చేయించామన్నారు.

బిహార్ +2 పరీక్షలలో అక్రమాలు జరిగిన విషయం బయటపడటంతో లల్కేశ్వర్ సింగ్, ఉషా సిన్హాలపై పోలీసులు కోర్టుకెళ్లి అరెస్టు వారంటు తెచ్చుకున్నారు. అప్పటినుంచి దంపతులిద్దరూ కనపడకుండా పారిపోయారు. ఎట్టకేలకు పోలీసులు వాళ్లను గాలించి పట్టుకోవడంతో స్కాంలో కీలక నిందితులు దొరికినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement