ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, బీజేపీ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
హంతకులు ఇంటి బయటే ఉన్నారు: కేజ్రీవాల్
Jun 20 2016 4:49 PM | Updated on Sep 4 2017 2:57 AM
	న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, బీజేపీ  పార్టీకి  మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన ఇంటి ముందు ధర్నా చేస్తున్న బీజేపీ ఎంపీ మహేశ్ గిరిని ఉద్ధేశించి 'హంతకులు తన ఇంటి ముందే ఉన్నారు'  అని కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ఎందుకు గిరిని  అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్నారని, అందుకే గిరిని అరెస్టు చేయడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ హత్యా రాజకీయాలపై చర్చకు సిద్ధమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	గత నెలలో జరిగిన ఎస్టేట్ అధికారి ఎమ్ఎమ్ ఖాన్ హత్య కేసులో అరెస్టయిన వ్యక్తితో  గిరికి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎన్ఎండీసీ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ తన్వర్ కు సైతం హత్యలో భాగం ఉందని, వీరిని కాపాడడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నిస్తున్నాడని కేజ్రీ ఆరోపించారు. గత నెలలో జరిగిన హత్య కేసులో తనపై కేజ్రీవాల్  నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో బీజేపీ ఎంపీ మహేశ్ గిరి కేజ్రీవాల్ ఇంటి  ముందు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
