అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ

KCR Met With Union Home Minister Amit Shah In Delhi - Sakshi

న్యూఢిల్లీ: నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ మీడియాతో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top