ప్రసంగిస్తూ వేదికపై కుప్పకూలిన మంత్రి | Kagodu Thimmappa collapses while delivering Independence Day speech | Sakshi
Sakshi News home page

ప్రసంగిస్తూ వేదికపై కుప్పకూలిన మంత్రి

Aug 15 2016 3:36 PM | Updated on Oct 30 2018 5:51 PM

ప్రసంగిస్తూ వేదికపై కుప్పకూలిన మంత్రి - Sakshi

ప్రసంగిస్తూ వేదికపై కుప్పకూలిన మంత్రి

కర్ణాటకలోని శివమొగలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శివమొగ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో సోమవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప(83) ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తిమ్మప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తిమ్మప్ప కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరైన తిమ్మప్పను ఇటీవలే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement