ఎన్డీఏ గూటికి మళ్లీ చేరే అవకాశమే లేదని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) స్పష్టం చేసింది.
కోల్కతా: ఎన్డీఏ గూటికి మళ్లీ చేరే అవకాశమే లేదని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) స్పష్టం చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ బదులు మరో వ్యక్తిని ఎంపిక చేసినా తమ వైఖరిపై పునరాలోచించబోమని పేర్కొంది. సుదీర్ఘకాలం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జేడీయూ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
ఎన్నికల అనంతరం బీజేపీ ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్ , రాజ్నాథ్ సింగ్ వంటి నాయకుల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నా మద్దతు ఇవ్వబోమని జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే మీ వైఖరి మార్చుకుంటారా అన్న ప్రశ్నకు త్యాగీ పైవిధంగా స్పందించారు.