నేతకు గురిపెడితే..బాడీగార్డ్ బలయ్యాడు.. | JD-U leader's bodyguard killed in parcel bomb blast | Sakshi
Sakshi News home page

నేతకు గురిపెడితే..బాడీగార్డ్ బలయ్యాడు..

May 26 2015 1:16 PM | Updated on Sep 3 2017 2:44 AM

బీహార్ గయాలో పార్సిల్ బాంబు ద్వారా జేడీయు నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక జేడీయే నేత ఇంట్లో పార్శిల్ బాంబు పేలిన ఘటనలో బాడీగార్డ్ చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పట్నా:   బీహార్ గయాలో పార్సిల్ బాంబు ద్వారా జేడీయు నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం  స్థానికంగా కలకలం రేపింది. స్థానిక జేడీయే నేత ఇంట్లో పార్శిల్ బాంబు పేలిన ఘటనలో  బాడీగార్డ్ చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్కు గుర్తు తెలియని వ్యక్తులు పార్సిల్ను పంపారు.  

అయితే పార్సిల్ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా  పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో బాడీగార్డ్  అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జేడీయూ నేత బంధువును ఆసుపత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సునీల్ కుమార్ తెలిపారు.  ఈ పేలుడుతో మావోయిస్టులకు సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement