భారతీయులకు ఇష్టమైనది ఫేస్‌బుక్కే! | Indians access Facebook 2.4 times more than Twitter | Sakshi
Sakshi News home page

భారతీయులకు ఇష్టమైనది ఫేస్‌బుక్కే!

Apr 6 2016 1:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

భారతీయులకు ఇష్టమైనది ఫేస్‌బుక్కే! - Sakshi

భారతీయులకు ఇష్టమైనది ఫేస్‌బుక్కే!

భారతీయులు ట్విట్టర్ కన్నా ఫేస్‌బుక్‌నే ఎక్కువగా ఇష్టపడతారంటున్నాయి తాజా అధ్యయనాలు.

భారతీయులు ట్విట్టర్ కన్నా ఫేస్‌బుక్‌నే ఎక్కువగా ఇష్టపడతారంటున్నాయి తాజా అధ్యయనాలు. ట్విట్టర్ కన్నా దీన్ని 2.4 రెట్లు ఎక్కువగా, యూట్యూబ్‌ కన్నా రెండు రెట్లు ఎక్కువగా దీన్ని భారతీయులు వినియోగిస్తారని ఇటీవల జరిపిన సర్వేల్లో వెల్లడైంది. ఇండియాలోని మెట్రో నగరాలకంటే 8 ప్రధాన నగరాల్లోనే ఫేస్‌బుక్ ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నారని మార్కెట్ పరిశోధన, బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ఐఎంఆర్బీ నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫేస్‌బుక్‌ను వినియోగించే వారిలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లలోనే వినియోగిస్తున్నారని, అందులోనూ  88 శాతం ప్రీ పెయిడ్ కనెక్షన్లే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతీయుల్లో ఎక్కువ మంది ఫేస్‌బుక్‌నే వాడుతున్నారని, ఆ తర్వాత వాట్సప్‌ను కూడా అదే స్థాయిలో ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఫేస్‌బుక్‌ను వాడేందుకు దేశంలోని సుమారు 63 శాతం మంది యూజర్లు 3జీ కనెక్షన్లను, 38 శాతం మంది 2జీ కనెక్షన్లను వాడుతున్నట్లు ఐఎంఆర్బీ లెక్కల్లో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement