‘భారత్‌ను సూపర్‌ పవర్‌గా మార్చిన వ్యక్తి’

Indian Cricketers Pays Tribute To Atal Bihari Vajpayee - Sakshi

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 

భారత్‌దేశానికి ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది.  భరత జాతికి అటల్‌ జీ చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.  - సచిన్‌ టెండూల్కర్‌

భారతదేశానికి అత్యంత ప్రియమైన ప్రధాని, గొప్ప కవి, నాయకుడు. భరత జాతి అటల్‌ జీని మిస్సవుతోంది. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా.   - వీవీఎస్‌ లక్ష్మణ్‌

దేశానికి ఈరోజు దుర్దినం. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అటల్‌ జీ ఆత్మకు శాంతి చేకూరాలి.  - అనిల్‌ కుంబ్లే

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం నన్నెంతగానో కలచివేసింది. నేను అభిమానించే రాజకీయ నాయకుల్లో ఆయనకు గొప్ప స్థానం ఉంది. నిజాయితీ, నిస్వార్థ వ్యక్తిత్వం కలిగిన అటల్‌ జీ దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.   - శిఖర్‌ ధావన్‌

ఈ వారమంతా భారత్‌కు బాగా లేనట్టుంది. మరో గొప్ప నేతను కోల్పోయాం. అటల్‌ జీ ఆత్మకు శాంతి కలగాలి.  -  రోహిత్‌ శర్మ

ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నాయకులు కొందరే ఉంటారు. వారిలో అటల్‌ జీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చిన గొప్ప వ్యక్తి. ఆయన మరణంతో ఓ మహా శకం ముగిసింది.   -  సురేశ్‌ రైనా

భారతదేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అస్తమయం ఎంతో మంది గుండెలను ద్రవింపజేసింది. - రవిచంద్రన్‌ అశ్విన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top