భారత్‌ చేతికి కిల్లర్‌ డ్రోన్స్‌..!!

India May Acqurie Killer Drones From US - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌ అమ్ములపొదిలో త్వరలో కిల్లర్‌ డ్రోన్స్‌ వచ్చి చేరనున్నాయి. దీంతో సరిహద్దుల్లో పాకిస్తాన్‌, చైనాతో ఎదురవుతున్న సవాళ్లకు చెక్‌ పెట్టొచ్చు. అంతేకాకుండా టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాల్లో కిల్లర్‌ డ్రోన్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని దేశాలకు అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌(యూఏవీ)లను అమ్మేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకురానున్నారు.

అమెరికా కీలక భాగస్వామ్యులు ఒకటైన ఇండియా కూడా 22 ప్రిడేటర్‌ బి డ్రోన్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా నియంత్రణ రేఖ(ఎల్‌వోసి) వెంబడి ఉగ్రస్థావరాలను నాశనం చేయొచ్చు. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి దేశ రక్షణ నిమిత్తం కూడా ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top