ఈ ఫ్యాన్‌కు ఉరేసుకోలేరు!

IIT Madras to install suicide-prevention device on hostel fans - Sakshi

సీలింగ్‌ ఫ్యాన్‌కు ప్రత్యేక ‘స్ప్రింగ్‌’

చెన్నై ఐఐటీలో పరిశోధనలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవాలనే విద్యార్థుల ప్రయత్నాలను అడ్డుకోవడంపై చెన్నై ఐఐటీ దృష్టి సారించింది. ఉరేసుకునేందుకు వీలు లేకుండా సీలింగ్‌ ఫ్యాన్‌లో ప్రత్యేక స్ప్రింగ్‌ అమర్చేందుకు పరిశో«ధనలు జరుగుతున్నాయి. ఐఐటీల్లో ప్రొఫెసర్ల వల్ల, జాతి, మత, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో కొందరు విద్యార్థులు మధ్యలోనే ఐఐటీని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఈ ఏడాది వరకు ఒక మహిళా ప్రొఫెసర్‌ సహా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనలపై మానవవనరులశాఖ చెన్నై ఐఐటీని మందలించింది. దీంతో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆత్మహత్యల్లో ఎక్కువశాతం మంది సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఫ్యాన్‌లో స్ప్రింగ్‌ లాంటి పరికరాన్ని అమర్చేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. ఎవరైనా ఊగినా, అదనపు బరువుతో వత్తిడి కలగజేసినా ఆ స్ప్రింగ్‌ సాగిపోయి ఫ్యాన్‌ కిందకు జారిపోతుంది. ఉరివేసుకున్న వారు సీలింగ్‌ ఫ్యాన్‌తో సహా కిందకు పడిపోతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top