అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

Published Thu, Jul 18 2019 3:09 AM

identify and deport every illegal immigrants - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్‌ అడిగిన ప్రశ్నకు అమిత్‌ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement