లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన సబ్‌ కలెక్టర్‌?!

IAS Officer Leaves Home Quarantine Return To Native Place Over Lockdown - Sakshi

తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న వేళ ఓ యువ ఐఏఎస్‌ అధికారి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికై పౌరులకు అవగాహన కల్పించాల్సిన ఆయనే స్వయంగా నిబంధనలను ఉల్లంఘించారు. హోం క్వారంటైన్‌ వీడి స్వస్థలానికి పయనమయ్యారు. దీంతో సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుపమ్‌ మిశ్రా కేరళలోని కొల్లాంలో సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల సెలవులపై విదేశాల్లో పర్యటించిన ఆయన.. మార్చి 18న భారత్‌కు తిరిగి వచ్చారు. అదే రోజు డ్యూటీలో జాయిన్‌ అయ్యారు.(లాక్‌డౌన్‌ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని..)

ఇక ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అనుపమ్‌ మిశ్రాను అధి​కారిక నివాసానికే పరిమితం కావాల్సిందిగా కొల్లాం కలెక్టర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనను ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం అనుపమ్‌ ఇంటికి వెళ్లిన పని మనుషులకు ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ విషయం గురించి గురువారం మీడియాతో మాట్లాడిన కలెక్టర్‌ అబ్దుల్‌ నజీర్‌.. ‘‘ అనుమప్‌ మిశ్రా ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది విచారించదగ్గ విషయం. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను’’ అని పేర్కొన్నారు.(లాక్‌డౌన్‌: సర్‌.. మీకిది కూడా తెలియదా?)

కరోనా నెగటివ్‌: అయ్యో పాపం...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top