కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ! | i did not kill any one, says gunloving sadhvi deva thakur | Sakshi
Sakshi News home page

కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ!

Nov 19 2016 12:34 PM | Updated on Aug 21 2018 3:16 PM

కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ! - Sakshi

కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ!

పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి పరారయిన మాతా సాధ్వి దేవ ఠాకూర్ కర్నల్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి పరారయిన మాతా సాధ్వి దేవ ఠాకూర్ కర్నల్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. శుక్రవారం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆమె తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. అధికారుల కథనం ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లి తంతు జరగుతుంటే తుపాకీతో గాల్లోకి సరదాగా కాల్పులు జరుపుతారు. ఈ వారం మొదట్లో హర్యానాలోని కర్నల్ జిల్లాలో సావిత్రి లాన్స్ అనే కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. అందులో పాల్గొన్న సాధ్వి దేవతో పాటు ఆమె అనుచరులు తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మేనత్త చనిపోగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.  

కాల్పులు జరిపిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరినీ హత్యచేయలేదని.. తనతో పాటు మరికొందరు కాల్పులు జరిపారని పోలీసులకు శుక్రవారం ఆమె తెలిపారు. తాను కాల్పులు జరపగా, ఏ ఒక్కరు గాయపడలేదని చెప్పారు. వాస్తవానికి పోలీసులకు లభ్యమైన వీడియోలో మరో వ్యక్తి కూడా గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్వి దేవ జరిపిన కాల్పుల వల్లే వరుడి మేనత్త చనిపోవడంతో ఆమె పరారయిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కర్నాల్ పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement