ఏకాభిప్రాయం ద్వారానే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.
ఆర్థిక మంత్రి జైట్లీ ఆశాభావం
న్యూఢిల్లీ: ఏకాభిప్రాయం ద్వారానే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సదస్సు తర్వాత పార్టీ ఎంపీల్ని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్టీ మండలిలో సుదీర్ఘంగా చర్చించాకే బిల్లుల్ని రూపొందించామన్నారు.
సవరణలు చేయాల్సిందే: కాంగ్రెస్
ప్రస్తుత రూపంలో జీఎస్టీ బిల్లుల్ని అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు జీఎస్టీపై చర్చించారు. జీఎస్టీపై ప్రజల ఆందోళనల్ని సభలో లేవనెత్తాలని, తప్పకుండా అవసరమైన సవరణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.