స్కాచ్‌, టెకీలా.. దేశమంతటా గోవా ఫెనీ! | Goa Feni May Soon Hit Your City Bars | Sakshi
Sakshi News home page

స్కాచ్‌, టెకీలా.. దేశమంతటా గోవా ఫెనీ!

Apr 28 2016 7:11 PM | Updated on Sep 3 2017 10:58 PM

స్కాచ్‌, టెకీలా.. దేశమంతటా గోవా ఫెనీ!

స్కాచ్‌, టెకీలా.. దేశమంతటా గోవా ఫెనీ!

మెక్సికన్ టెకీలా, స్కాచ్‌ కూడా ఒకప్పుడు దేశీ నాటుసారాలాంటివే.. కానీ అంతర్జాతీయంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు అవి టాప్ బ్రాండ్‌ మద్యంలా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.

మెక్సికన్ టెకీలా, స్కాచ్‌ కూడా ఒకప్పుడు దేశీ నాటుసారాలాంటివే.. కానీ అంతర్జాతీయంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు అవి టాప్ బ్రాండ్‌ మద్యంలా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. అదేరీతిలో గోవాలో ఫేమస్ అయిన నాటుసారాను దేశమంతటా అమ్మాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

గోవాకు వెళ్లే మద్యం ప్రియులు అక్కడి నాటు బట్టీసారాను రుచి చూడకుండా ఉండలేరు. 'ఫెనీ' పెరిట పిలిచే ఈ సారాను సేవించేందుకు ఇప్పుడు గోవాకు దాకా రావాల్సిన అవసరం లేదు. దేశమంతటా అందుబాటులోకి తెస్తామంటోంది గోవా ప్రభుత్వం. ఇందుకోసం గోవా ఎక్సైజ్ డ్యూటీ చట్టంలో సవరణలు తీసుకొస్తున్నది. స్కాచ్, టెకీల తరహాలో ఫెనీకు కూడా అంతర్జాతీయ స్థాయి డ్రింక్‌గా పేరు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గోవా ఎక్సైజ్ కమిషనర్ మినినో డిసౌజా తెలిపారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం దామన్‌లో మినహా దేశమంతటా సారా అమ్మకాలపై నిషేధం ఉందని, ఈ నేపథ్యంలో 'హెరిటెజ్‌ స్పిరిట్‌' (సాంస్కృతిక సారా)గా అంతర్జాతీయ మద్యం స్థాయిలో దీనిని తీసుకొస్తున్నామని, ఒకప్పుడు దేశీయ మద్యాలైన టెకిలా, స్కాచ్‌ స్థాయిలో ఫెనీ ఉంటుందని ఆయన వివరించారు. జూలై జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్సైజ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశమంతటా ఫెనీ అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement