జ్వరానికి, నొప్పి నివారణకు విస్తృతంగా ఉపయోగించే క్రోసిన ధర దాదాపు సగానికి తగ్గబోతోంది.
జ్వరానికి, నొప్పి నివారణకు విస్తృతంగా ఉపయోగించే క్రోసిన ధర దాదాపు సగానికి తగ్గబోతోంది. జాతీయ ఔషధ ధరల సంస్థ (ఎన్పీపీఏ) ఆదేశాల మేరకు ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ క్రోసిన్ ఔషధాన్ని ధరల నియంత్రణ నుంచి మినహాయించాలని గ్లాక్సో చేసుకున్న దరఖాస్తును ఎన్పీపీఏ తిరస్కరించడంతో ఈ చర్య తప్పలేదు. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు (డీపీసీఓ) 2013 ప్రకారం గ్లాక్సో సంస్థ క్రోసిన్ ధర తగ్గింపును తక్షణం అమలుచేస్తోంది.
క్రోసిన్ అడ్వాన్స్ ఫాస్ట్ రిలీజ్ 500 ఎంజీ ప్రస్తుత ధర 15 టాబ్లెట్ల స్ట్రిప్ 30 రూపాయలుగా ఉంది. అయితే, పారాసిట్మాల్ 500 ఎంజీ ధరను ఒక్కో టాబ్లెట్కు 94 పైసలు మాత్రమే ఉంచాలని ఎన్పీపీఏ ఆదేశించింది. దాంతో స్ట్రిప్ ధర దాదాపు రూ. 14 కాబోతోంది. వాస్తవానికి ఈ ధర విషయంలో గందరగోళం కారణంగా దాదాపు నెల రోజుల నుంచి క్రోసిన్ మందు అసలు మార్కెట్లలో కనిపించడం తగ్గిపోయింది.