breaking news
crocin tablets
-
డోలో 650 సంచలనం.. సేల్స్‌తో సరికొత్త రికార్డు!
మన ఇంట్లో ఎవరికైన తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వస్తే వెంటనే మనందరికీ డోలో 650 గుర్తుకొస్తుంది ఇప్పుడు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా వాడేస్తునారు ప్రజలు. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన మెడిసిన్‌గా డోలో 650 ఆవిర్భవించింది. ఈ మహమ్మారి కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా ఈ డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతుంది. డోలో 650 అనేది ఒక ప్రసిద్ధ పెయిన్ కిల్లర్, ఇది దాదాపు ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి, జ్వరాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు!. 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి భారతదేశం యాంటీ ఫీవర్ ఔషధం డోలో 650లను 350 కోట్ల మాత్రలకు పైగా విక్రయించింది. ఈ మొత్తం 3.5 బిలియన్ మాత్రలను నిలువుగా పేర్చితే ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 6,000 రెట్లు ఎక్కువ ఎత్తు లేదా ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎత్తుకు 63,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గత రెండు సంవత్సరాలలో డోలో 1.5 సెం.మీ పొడవైన పారాసెటమాల్ టాబ్లెట్, క్రోసిన్ కంటే చాలా ఎక్కువ అమ్ముడైనది. పరిశోధన సంస్థ ఐక్యూవిఏ గణాంకాలప్రకారం.. 2019 లో కోవిడ్-19 వ్యాప్తికి ముందు కంటే భారతదేశంలో సుమారు 75 మిలియన్ స్ట్రిప్‌ల డోలో మాత్రలను విక్రయించింది. ప్రస్తుతం కోవిడ్-19 రోగులకు సిఫారసు చేసిన ఈ డోలో 2021లో రూ.307 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. డోలో ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాంటీ ఫీవర్ మరియు అనల్జెసిక్ టాబ్లెట్. దీని కంటే ముందు వరుసలో Calpol ఉంది. ఈ ట్యాబ్లెట్ కి సంబంధించి మిమ్స్ కూడా ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. #డోలో650 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. 🤣🤣 pic.twitter.com/u983mrmfWx — Bollywoodirect (@Bollywoodirect) January 18, 2022 This is why #dolo650 is trending ? pic.twitter.com/4BywaCnmuc — Nocturnal Soul (@Mirage_gurrl) January 7, 2022 (చదవండి: వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!) -
సగానికి తగ్గనున్న క్రోసిన్ టాబ్లెట్ల ధర
జ్వరానికి, నొప్పి నివారణకు విస్తృతంగా ఉపయోగించే క్రోసిన ధర దాదాపు సగానికి తగ్గబోతోంది. జాతీయ ఔషధ ధరల సంస్థ (ఎన్పీపీఏ) ఆదేశాల మేరకు ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ క్రోసిన్ ఔషధాన్ని ధరల నియంత్రణ నుంచి మినహాయించాలని గ్లాక్సో చేసుకున్న దరఖాస్తును ఎన్పీపీఏ తిరస్కరించడంతో ఈ చర్య తప్పలేదు. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు (డీపీసీఓ) 2013 ప్రకారం గ్లాక్సో సంస్థ క్రోసిన్ ధర తగ్గింపును తక్షణం అమలుచేస్తోంది. క్రోసిన్ అడ్వాన్స్ ఫాస్ట్ రిలీజ్ 500 ఎంజీ ప్రస్తుత ధర 15 టాబ్లెట్ల స్ట్రిప్ 30 రూపాయలుగా ఉంది. అయితే, పారాసిట్మాల్ 500 ఎంజీ ధరను ఒక్కో టాబ్లెట్‌కు 94 పైసలు మాత్రమే ఉంచాలని ఎన్పీపీఏ ఆదేశించింది. దాంతో స్ట్రిప్ ధర దాదాపు రూ. 14 కాబోతోంది. వాస్తవానికి ఈ ధర విషయంలో గందరగోళం కారణంగా దాదాపు నెల రోజుల నుంచి క్రోసిన్ మందు అసలు మార్కెట్లలో కనిపించడం తగ్గిపోయింది.