అగ్ర కులాలకూ రిజర్వేషన్లుః కేం‍ద్ర మంత్రి అథవాలే | Give quota to upper castes: MoS Ramdas Athawale | Sakshi
Sakshi News home page

అగ్ర కులాలకూ రిజర్వేషన్లుః కేం‍ద్ర మంత్రి అథవాలే

Sep 17 2017 5:02 PM | Updated on Sep 19 2017 4:41 PM

అగ్ర కులాలకూ రిజర్వేషన్లుః కేం‍ద్ర మంత్రి అథవాలే

అగ్ర కులాలకూ రిజర్వేషన్లుః కేం‍ద్ర మంత్రి అథవాలే

అగ్రవర్ణాల్లో పేదలకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని, ఉద్యోగాల్లో కోటాను ప్రస్తుతమున్న 49.5 నుంచి 75 శాతానికి పెంచాలని కేం‍ద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్‌ అథవలే అన్నారు.

సాక్షి,అహ్మదాబాద్‌: అగ్రవర్ణాల్లో పేదలకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని, ఉద్యోగాల్లో కోటాను ప్రస్తుతమున్న 49.5 నుంచి 75 శాతానికి పెంచాలని కేం‍ద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. గతంలో భారత క్రికెట్‌ జట్టులో ఎస్‌సీ, ఎస్‌టీలకు కోటా కోసం అథవలే డిమాండ్‌ చేశారు. పటేళ్లు, రాజ్‌పుట్స్‌, బ్రాహ్మణులు, బనియాలు, మరాఠాలకూ రిజర్వేషన్లు కల్పించేందుకు కోటాను మరో 25 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
 
ఈ కులాల్లో క్రీమిలేయర్‌ పరిమితిని ఏడాదికి రూ 8 లక్షలుగా నిర్ణయించాలన్నారు.అగ్ర కులాలకు ఇచ్చే రిజర్వేషన్‌తో ప్రస్తుత కోటా సిస్టమ్‌లో విఘాతం కలుగరాదని, ఎస్‌సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సి ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement