పైలెట్ అయిన ఆటోడ్రైవర్ | From A Delivery Boy To An Auto-Driver And Now A Pilot, Here's Shrikant Pantawane's Inspirational Story | Sakshi
Sakshi News home page

పైలెట్ అయిన ఆటోడ్రైవర్

Jul 16 2015 5:14 PM | Updated on Mar 9 2019 4:29 PM

పైలెట్ అయిన ఆటోడ్రైవర్ - Sakshi

పైలెట్ అయిన ఆటోడ్రైవర్

లక్ష్యాలకు ఇబ్బందులు ఆటంకం కాదని నిరూపించాడో యువకుడు.

నాగ్పూర్: లక్ష్యాలకు ఇబ్బందులు ఆటంకం కాదని నిరూపించాడో యువకుడు. నాగ్పూర్కు చెందిన శ్రీకాంత్ పంటవేన్ సాధారణ కుటుంబంలో జన్మించాడు.తండ్రి ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీ గార్డుగా చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతన్ని డెలివరీ బాయ్గా జీవితం ప్రారంభించేలా చేశాయి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఆ తర్వాత ఆటో డ్రైవర్గా పని చేయడం ప్రారంభించాడు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలని మోస్తూనే మరో వైపు చదువుకోవాలనే పట్టుదలని విడిచిపెట్టలేదు ఆ యువకుడు.

ఆటో నడుపుతున్న సమయంలో ఒక పార్శిల్ని విమానాశ్రయంలో డెలివర్ చేయడానికి వెళ్లాడు..అప్పుడక్కడ పైలట్ శిక్షణలో  ఉన్న అభ్యర్థులతో మాట్లాడాడు..పైలెట్గా రాణించాలంటే కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే కాకుండా ఇంకా మార్గాలున్న విషయాన్ని తెలుసుకున్నాడు. డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)ద్వారా పైలెట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయవచ్చని తెలుసుకున్న శ్రీకాంత్ వెనుదిరిగి చూడలేదు..
ఇంటర్లో ఉండగానే స్కాలర్షిప్ కోసం చదవడం ప్రారంభించాడు. ఇంటర్ పూర్తి అవ్వడంతోనే మధ్యప్రదేశ్లోని ఫ్లైయింగ్ స్కూల్లో స్కాలర్షిప్తో సీటు సంపాదించగిగాడు..కానీ అతనికి అప్పడు మరో సమస్య ఎదురైంది. అది ఇంగ్లీష్ రూపంలో, అయినా సరే స్నేహితుల సహకారం, అకుంటిత దీక్షతో ఆ సమస్యని అధిగమించగలిగాడు.

అక్కడ చదువుని పూర్తి చేసుకుని, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ని పొందాడు..కానీ విమానయాన రంగం స్తబ్ధుగా ఉండటంతో ఎన్నో ఆశలతో బయటికి వచ్చిన అతను వేచి చూడాల్సి వచ్చింది...తన కుటుంబపోషణకు ఒక కార్పోరేట్ ఆఫీస్లో ఎక్సిగ్యూటివ్ గా ఉద్యోగంలో చేరినా పైలట్గా గాల్లో ఎగరాలనే తన కోరికను వదలలేదు.. తన ప్రయత్నాలను చేస్తున్నతరునంలోనే రెండు నెలల కింద ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి పైలెట్ చేరాలని కాల్ లెటర్ వచ్చింది..
అతని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలులాంటివి  ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందలేదు..ఇప్పుడుకూడా మూడు టైర్ల వాహనంలోనే పని చేస్తున్నాడు.. కానీ ఈ సారి ఆటో రిక్షా కాదు..అందరూ ఎంతో గొప్పగా భావించే విమానం లో...
చిన్నతనంలో కన్న కలని నేరవేర్చుకోవడానికి అతని కష్టపడేగుణం, సంకల్పం, ఎంతోకొంత అదృష్టం అతన్ని విజేతని చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement