breaking news
Shrikant Pantawane
-
పైలెట్ అయిన ఆటోడ్రైవర్
నాగ్‌పూర్: లక్ష్యాలకు ఇబ్బందులు ఆటంకం కాదని నిరూపించాడో యువకుడు. నాగ్‌పూర్‌కు చెందిన శ్రీకాంత్ పంటవేన్ సాధారణ కుటుంబంలో జన్మించాడు.తండ్రి ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీ గార్డుగా చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతన్ని డెలివరీ బాయ్‌గా జీవితం ప్రారంభించేలా చేశాయి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పని చేయడం ప్రారంభించాడు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలని మోస్తూనే మరో వైపు చదువుకోవాలనే పట్టుదలని విడిచిపెట్టలేదు ఆ యువకుడు. ఆటో నడుపుతున్న సమయంలో ఒక పార్శిల్ని విమానాశ్రయంలో డెలివర్ చేయడానికి వెళ్లాడు..అప్పుడక్కడ పైలట్ శిక్షణలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడాడు..పైలెట్‌గా రాణించాలంటే కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే కాకుండా ఇంకా మార్గాలున్న విషయాన్ని తెలుసుకున్నాడు. డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)ద్వారా పైలెట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయవచ్చని తెలుసుకున్న శ్రీకాంత్ వెనుదిరిగి చూడలేదు.. ఇంటర్లో ఉండగానే స్కాలర్షిప్ కోసం చదవడం ప్రారంభించాడు. ఇంటర్ పూర్తి అవ్వడంతోనే మధ్యప్రదేశ్‌లోని ఫ్లైయింగ్ స్కూల్లో స్కాలర్‌షిప్‌తో సీటు సంపాదించగిగాడు..కానీ అతనికి అప్పడు మరో సమస్య ఎదురైంది. అది ఇంగ్లీష్ రూపంలో, అయినా సరే స్నేహితుల సహకారం, అకుంటిత దీక్షతో ఆ సమస్యని అధిగమించగలిగాడు. అక్కడ చదువుని పూర్తి చేసుకుని, కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌ని పొందాడు..కానీ విమానయాన రంగం స్తబ్ధుగా ఉండటంతో ఎన్నో ఆశలతో బయటికి వచ్చిన అతను వేచి చూడాల్సి వచ్చింది...తన కుటుంబపోషణకు ఒక కార్పోరేట్ ఆఫీస్‌లో ఎక్సిగ్యూటివ్ గా ఉద్యోగంలో చేరినా పైలట్‌గా గాల్లో ఎగరాలనే తన కోరికను వదలలేదు.. తన ప్రయత్నాలను చేస్తున్నతరునంలోనే రెండు నెలల కింద ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి పైలెట్ చేరాలని కాల్ లెటర్ వచ్చింది.. అతని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలులాంటివి ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందలేదు..ఇప్పుడుకూడా మూడు టైర్ల వాహనంలోనే పని చేస్తున్నాడు.. కానీ ఈ సారి ఆటో రిక్షా కాదు..అందరూ ఎంతో గొప్పగా భావించే విమానం లో... చిన్నతనంలో కన్న కలని నేరవేర్చుకోవడానికి అతని కష్టపడేగుణం, సంకల్పం, ఎంతోకొంత అదృష్టం అతన్ని విజేతని చేశాయి. -
ఆటో డ్రైవర్.. పైలట్ అయ్యాడు
నిన్నటి వృత్తి ఆటో రిక్షా డ్రైవర్. నేడు ఆకాశంలో విహరించే విమానానికి పైలట్. ఆటోకు, విమానానికి మూడే చక్రాలు ఉండొచ్చు కానీ ఆటో డ్రైవర్.. పైలట్ కావడమన్నది అసాధారణ విషయం. ఆటో డ్రైవర్ నుంచి పైలట్‌గా మారి శ్రీకాంత్ పంటవానె యువతకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన శ్రీకాంత్ ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ స్ఫూర్తి కథనాన్ని ఇండిగో ట్విటర్లో వెల్లడించింది. ఇండిగో మేగజైన్లో కూడా ఈ కథనం ప్రచురితంకానుంది. శ్రీకాంత్‌ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డు. దీంతో సంపాదన కోసం శ్రీకాంత్ చిన్నతనం నుంచే ఏదో ఒకపని చేసేవాడు. స్కూలు రోజుల్లో చదువుకుంటూ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఆటోను నడిపాడు. శ్రీకాంత్‌కు టీ స్టాల్ నడిపే వ్యక్తితో ఏర్పడిన పరిచయం అతని జీవితంలో మార్పు తెచ్చింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ పేద విద్యార్థుల కోసం పైలట్ స్కాలర్షిప్ పథకం అందిస్తున్నట్టు ఆయన ద్వారా శ్రీకాంత్ తెలుసుకున్నాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీకాంత్ స్కాలర్షిప్ సాధించి మధ్యప్రదేశ్‌లో ఫ్లైయింగ్ స్కూల్లో శిక్షణ పొందాడు. స్కూల్లో శ్రీకాంత్ టాపర్‌గా ఉండేవాడని ఇండిగో వెల్లడించింది. శ్రీకాంత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినా.. విమానయాన రంగంలో సంక్షోభం కారణంగా కొంతకాలం ఉద్యోగం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. శ్రీకాంత్ చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా చేరాడు.