ఘోర రోడ్డు ప్రమాదం; 14 మంది మృతి

Fourteen Died In Major Bus Accident Occured In Uttar Pradesh - Sakshi

ఫిరోజాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరికి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top