బీజేపీలోకి ఎన్సీపీ నేత గావిత్ | Former Maharashtra NCP Minister Vijaykumar Gavit Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ఎన్సీపీ నేత గావిత్

Sep 6 2014 10:27 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఎన్సీపీ మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

ముంబై: ఎన్సీపీ మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే గావిత్‌కు స్వాగతం పలికారు. కాగా విజయ్‌కుమార్ వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి.

 ఈ విషయమై గావిత్ మాట్లాడుతూ కోర్టులో లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించి ఆరోపణలు రుజువు చేయాలని, అలా చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా  తప్పుకొంటానని పేర్కొన్నారు.  అనంతరం బీజేపీ  నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ గావిత్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement