వాలెంటైన్స్‌ డే రోజే ఆగ్నికి ఆహుతి

Fire Erupts at Factory in Naraina 20 Fire Tenders at Spot - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. కరోల్‌ బాగ్‌ ట్రాజెడీని ఇంకా మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది.  వాలెంటైన్స్‌ డే కార్డులు, ఇతర గిఫ్ట్‌ కార్డులను తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున  గ్రీటింగ్‌ కార్డులు  అగ్నికి ఆహుతి కావడం విషాదం.  అదీ  వాలెంటైన్స్‌ డే రోజు.  

వెస్ట్‌ ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ పైఅంతస్థులో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే  ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. 

కాగా ఫిబ్రవరి 12వతేదీన  కరోల్‌ బాగ్‌లోని అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్‌ దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే  బుధవారం జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు  250కిపైగా నిరుపేదల గుడిసెలు కాలి బూడిద కాగా, గురువారం మరో ప్రమాదంతో ఢిల్లీ నగరం నిద్ర లేచింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top