
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని కొలబా ప్రాంతంలోని తాజ్‌మహల్ హోటల్, డిప్లామాట్ హోటల్ వద్ద చర్చ్ చాంబర్ బిల్డింగ్ మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను సిబ్బంది నిచ్చెనల ద్వారా బయటకు తీసుకువచ్చారు. మంటలను ఆర్పే ప్రక్రియతో పాటు సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు.