గుడికొచ్చి భోంచేసిన వినాయకుడు.. వైరల్‌ వీడియో | Elephant Entered Anubhavi Subramaniar Temple | Sakshi
Sakshi News home page

గుడికొచ్చి భోంచేసిన వినాయకుడు.. వైరల్‌ వీడియో

Mar 25 2018 4:37 PM | Updated on Mar 25 2018 4:56 PM

Elephant Entered Anubhavi Subramaniar Temple - Sakshi

కోయంబత్తూర్‌: వినాయకుడు పాలు తాగడం, విగ్రహాం కంటి నుంచి నీళ్లు కారడం వంటి పుకార్లు విన్నాం. కానీ ఇది మాత్రం నిజం. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనను నమ్మితీరాల్సిందే ఎందుకంటే.. ఇక్కడ జరిగిన దానికి సీసీటీవి సాక్ష్యంగా ఉంది ఇంతకి ఏం జరిగిందంటే..  రాత్రిపూట ఒక భారీ ఏనుగు గుడిలోకి ప్రవేశించి వంట గదిలోని ఆహార పదార్థాలను తిని వెళ్లింది. ఈ సంఘటన కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఏనుగు గుడిలోకి ప్రవేశించి.. వంట గదిలో ఆహారం తిన్న దృశ్యాలన్ని సీసీ టీవిలో రికార్డ్‌ అయ్యాయి.

తన తమ్ముడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలోకి గజేంద్రుడు రాత్రిపూట వచ్చి గుడిలోని వంటశాలలో ఉన్న ఆహారం భుజించి వెళ్లాడని, వచ్చింది ఏనుగు కాదు సాక్షాత్తు ఆ వినాయకుడే అని భక్తులు చెప్తున్నారు. కొంతమంది నాస్తికులు మాత్రం ఈ విషయాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. ఆలయం చుట్టు అడవి ప్రాంతం ఉందని, రాత్రిపూట జంతువులు ఆలయంలోకి ప్రవేశించడం సాధారణ విషయం అని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement