breaking news
subramaneshwara swamy temple
-
మహా కుంభాభిషేకం : భక్తజన సంద్రం.. తిరుచెందూరు
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. ఏర్పాట్లు పూర్తి.. కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. Thoothukudi, Tamil Nadu: The Maha Kumbabhishekam at Tiruchendur Subramania Swamy Temple marked the culmination of ₹300 crore renovations. Held with elaborate rituals, holy water anointing, drone blessings, and live broadcasts, it drew thousands of devotees, secured by 6,000… pic.twitter.com/1OHDv5u40O— IANS (@ians_india) July 7, 2025 సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్‌తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు. తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు. నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో.. భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
గుడికొచ్చి భోంచేసిన వినాయకుడు.. వైరల్ వీడియో
కోయంబత్తూర్: వినాయకుడు పాలు తాగడం, విగ్రహాం కంటి నుంచి నీళ్లు కారడం వంటి పుకార్లు విన్నాం. కానీ ఇది మాత్రం నిజం. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనను నమ్మితీరాల్సిందే ఎందుకంటే.. ఇక్కడ జరిగిన దానికి సీసీటీవి సాక్ష్యంగా ఉంది ఇంతకి ఏం జరిగిందంటే.. రాత్రిపూట ఒక భారీ ఏనుగు గుడిలోకి ప్రవేశించి వంట గదిలోని ఆహార పదార్థాలను తిని వెళ్లింది. ఈ సంఘటన కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఏనుగు గుడిలోకి ప్రవేశించి.. వంట గదిలో ఆహారం తిన్న దృశ్యాలన్ని సీసీ టీవిలో రికార్డ్ అయ్యాయి. తన తమ్ముడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలోకి గజేంద్రుడు రాత్రిపూట వచ్చి గుడిలోని వంటశాలలో ఉన్న ఆహారం భుజించి వెళ్లాడని, వచ్చింది ఏనుగు కాదు సాక్షాత్తు ఆ వినాయకుడే అని భక్తులు చెప్తున్నారు. కొంతమంది నాస్తికులు మాత్రం ఈ విషయాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. ఆలయం చుట్టు అడవి ప్రాంతం ఉందని, రాత్రిపూట జంతువులు ఆలయంలోకి ప్రవేశించడం సాధారణ విషయం అని అంటున్నారు. -
లక్ష్మీ వల్లభా...నీ ఆస్తి గోవిందా?
సింగరాయపాలెం (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : పురాణ పురుషుడైన లక్ష్మీనరసింహుడు ఆస్తి గొడవల్లో చిక్కుకున్నాడు! మార్కెట్ ప్రస్తుత ధర ప్రకారం కోటీ 50 లక్షల రూపాయల విలువైన నారసింహుని చెరువును, భూమిని ఆక్రమించేందుకు సింగరాయపాలెం గ్రామ పంచాయతీ రంగం సిద్ధం చేస్తోంది. మండలంలోని సింగరాయపాలెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 100 ఎకరాల వరకు భూములున్నాయి. వీటిలో సింగరాయపాలెం సెంటర్లో ఆర్ఎస్ నంబర్ 70లో తొమ్మిది ఎకరాల చేపల చెరువు, దానిని ఆనుకుని తూర్పు వైపు ఖాళీ స్థలం ఉన్నాయి. తరతరాలుగా ఇవి ఆలయ ఆధీనంలో ఉండగా వాటిపై వచ్చే ఆదాయం స్వామివారికే జమవుతోంది. ప్రస్తుతం.. ఈ చెరువు, స్థలం తనదేనంటూ గ్రామపంచాయతీ కొత్త వివాదానికి తెర తీసింది. ఇంతటితో ఆగకుండా ఖాళీ స్థలంలో రూ.12 లక్షల మండలపరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేతులమీదుగా ఈ నెల 28న దానికి భూమిపూజ కూడా చేసేశారు. దీంతో వివాదం ముదురుపాకాన పడింది. నిద్రావస్థలో పంచాయతీ... అనేక సంవత్సరాలుగా ఈ చెరువు, స్థలం దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. చెరువులో చేపలు పెంచుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీనిపై వచ్చిన ఆదాయం ఆలయ నిర్వహణకే ఉపయోగిస్తున్నారు. ఖాళీ స్థలంలో చెత్తాచెదారం పేరుకుపోతున్నా ఈ స్థలం తమదికాదంటూ పంచాయతీ తప్పించుకుందేతప్ప ఏనాడూ తొలగించిన పాపానపోలేదు. సెంటర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయషష్ఠి ఉత్సవాల సందర్భంగా ఈ స్థలంలో తాత్కాలిక షాపులు నిర్వహించుకునేందుకు ఆలయాధికారులే వేలం పాటలు నిర్వహిస్తున్నా ఏనాడూ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆస్తి తనదేనంటూ పంచాయతీ ముందుకురావడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అమ్మినా అడ్డు చెప్పలేదు... స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా స్థలం లేదు. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ చెరువును కొంతభాగం అమ్మాలని అధికారులు కోరారు. ఈ అభ్యర్థనపై 2004లో దేవాదాయ శాఖాధికారులు ఎకరం లక్ష రూపాయలు చొప్పున చెరువులో రెండెకరాలు అప్పగించారు. దీనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అధికారులు పూడ్పించి పలు కట్టడాలు నిర్మించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెరువు తనదేనంటూ పంచాయతీ అడ్డుచెప్పకుండా ఇప్పుడు స్థలం తనదంటూ నిర్మాణాలకు పూనుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రికార్డుల్లో ఊరచెరువు... రెవెన్యూ రికార్డుల్లో ఊరచెరువుగా ఉన్నందున దీనిపై సర్వహక్కులూ తమకే ఉంటాయని పంచాయతీ అధికారులు వాదిస్తున్నారు. ఇప్పటివరకు స్థలం, చెరువుతో తమకెలాంటి అవసరం లేనందున వాటి జోలికి పోలేదని వాదిస్తున్నారు. నిధులు వృథాకాకుండా ఉండేందుకే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. జాతీయరహదారికి, చెరువుకు మధ్య ఉన్న ఖాళీ స్థలం రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు భూమిగా ఉన్నందున దానిపైనా సర్వహక్కులూ తమకే ఉన్నాయని చె బుతున్నారు. చెరువును స్వాధీనం చేసుకుంటే పంచాయతీకి గణనీయమైన ఆదాయం వస్తుందని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటుందని పేర్కొంటున్నారు. రికార్డుల్లో ఊరచెరువు, పోరంబోకు భూమిగా నమోదు చేసినంతమాత్రాన ఏవిధంగా చెల్లుతుందనేది ఆలయ అధికారుల వాదన. అలాంటప్పుడు తమ వద్దే రెవెన్యూ అధికారులు శిస్తులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇరు వర్గాలూ ఈ ఆస్తి తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. వెనక్కి తగ్గేది లేదు... రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆస్తిపై పంచాయతీకే సర్వహక్కులూ ఉన్నాయి. అయినా షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమిపూజ చేసేముందు అధికారులకు మౌఖికంగా తెలిపాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? - గూడపాటి రమేష్, పంచాయతీ కార్యదర్శి కోర్టు తీర్పు ఉంది... చెరువు, ఖాళీ స్థలం ఆలయానికి చెందినవేనంటూ గుడివాడ సబ్‌కోర్టు 1950లోనే తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన ఈ ఆస్తిని వదులుకోం. - సీహెచ్ సుధాకర్, ఆలయ ఈవో