
మహాకుంభాభిషేకానికి సన్నద్ధం
నేడు ప్రత్యేక వేడుకలు
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు.

ఏర్పాట్లు పూర్తి..
కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి.
Thoothukudi, Tamil Nadu: The Maha Kumbabhishekam at Tiruchendur Subramania Swamy Temple marked the culmination of ₹300 crore renovations. Held with elaborate rituals, holy water anointing, drone blessings, and live broadcasts, it drew thousands of devotees, secured by 6,000… pic.twitter.com/1OHDv5u40O
— IANS (@ians_india) July 7, 2025
సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు
న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్‌తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు.
తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు.
నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో..
భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్‌లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.