తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ | Dr. K laxman to be next bjp president for telananga | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్

Apr 8 2016 3:23 PM | Updated on Mar 29 2019 5:32 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ - Sakshi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్

పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది.

పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ కె. లక్ష్మణ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం ఆయన ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈ అధ్యక్ష పదవి లభించింది.

ఇక కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. కొన్నాళ్ల పాటు బీజేపీకి దూరమై సొంత కుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప.. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరి, ఏకంగా అధ్యక్ష పదవిని కూడా చేపడుతుండటం విశేషం. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కేశవ ప్రసాద్ మౌర్య, పంజాబ్ బీజేపీ చీఫ్‌గా విజయ్ సంప్లా, అరుణాచల్ పార్టీ అధ్యక్షుడిగా తపిర్ గావోలను అధిష్ఠానం నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement