మావోల దాడి: డీడీ ఉద్యోగి సెల్ఫీ వీడియో

Doordarshan staffer Selfie Video As Naxals Attacked Him - Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహు మృతి చెందిన విషయం తెలిసిందే. దంతేవాడలోని ఆరన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలవాయి వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కాల్పులు జరుగుతున్న సమయంలో దూరదర్శన్‌ బృందంలోని రిపోర్టర్‌ ధీరజ్‌ కుమార్, లైట్‌ అసిస్టెంట్‌ మొర్ముక్త్‌ శర్మ చాకచక్యంగా వ్యవహరించి ఓ గుంతలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఆ సమయంలో తన తల్లిని ఉద్దేశించి మొర్ముక్త్‌ శర్మ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (పోలీసులపై మావోల దాడి)

‘మా బృందంలోని ముగ్గురం బైక్‌లపై వెళ్తున్నాం. అకస్మాత్తుగా నక్సల్స్‌ మాపై అటాక్‌ చేశారు. మమ్మల్ని చుట్టుముట్టేశారు. ఈ ఘటనలో సాహు గాయపడ్డాడు. అమ్మా.. ఐ లవ్‌ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను బతకడం కష్టమే. ఏ క్షణాన్నైనా నేను మృత్యువు ఒడిలోకి చేరవచ్చు. కానీ నాకేం భయంలేదు. మాతో పాటు ఉన్న జవాన్లు నక్సల్స్‌తో పోరాడుతున్నారు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను. జాగ్రత్త అమ్మా’  అంటూ మొర్ముక్త్‌ శర్మ తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి గురించి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top