
ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త!
నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాలకు చెందినవాళ్లు సైన్యాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలో భారతీయ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ చేరాడు. భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సుశీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. 'భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద్' అని హిందీలో కూడా పేర్కొన్నాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సుశీల్ కుమార్ కూడా వారి సరసన చేరాడు.
మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ అంశంపై స్పందించి ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్క భారతీయుడి ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన భారతీయ సైన్యానికి హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్‌లో అజయ్ దేవ్‌గణ్ పేర్కొన్నాడు. పలు సినిమాల్లో పోలీసు పాత్రలతో పాటు సైనిక పాత్రలు కూడా ధరించిన అజయ్.. ఈ అంశంపై స్పందించాడు.
Don't mess with the Indian Army. भारतीय सेना से पंगा मत लेना l जय हिंद #SurgicalStrike
— Sushil Kumar (@WrestlerSushil) 30 September 2016
Hats off to the Indian army for proving that every Indian life matters.#SaluteToTheArmy
— Ajay Devgn (@ajaydevgn) 30 September 2016