సీఎన్‌ఎన్‌ X ట్రంప్‌

Donald trump India Visit: Trump Fires On CNN Reporter - Sakshi

మీ ఎన్నికకు విదేశీ సాయం అక్కర్లేదా?: విలేకరి

నేను ఎవ్వరినీ సాయం అడగలేదు: అధ్యక్షుడు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘మీ పనితీరు చూసి మీరే సిగ్గుపడాలి’అంటూ సీఎన్‌ఎన్‌ విలేకరి అకోస్టాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం ఇందుకు వేదికయింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ మీరు ప్రతిజ్ఞ చేస్తారా?, ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు? అంటూ ఈ సమావేశంలో సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌ జిమ్‌ అకోస్టా ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్‌.. ‘ఎన్నికల్లో సాయం చేయాలని ఏ దేశాన్ని కోరలేదు. ఏ దేశం నుంచి నాకు సాయం అందలేదు కూడా’అని బదులిస్తూ.. ఇటీవల ఓ వార్తాంశంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీఎన్‌ఎన్‌ క్షమాపణ చెప్పాలన్నారు.(కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!)

నిజాన్ని వెల్లడించడంలో మీతో పోలిస్తే మాకు మంచి రికార్డే ఉంది’అని అకోస్టా అనడంతో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ రికార్డు ఏమిటో నేను చెబుతా. ఆ రికార్డు చూసి మీరే సిగ్గుపడతారు’అని పేర్కొన్నారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2018లో మీడియా సమావేశంలో ట్రంప్‌తో వాదులాటకు దిగిన అకోస్టా మీడియా పాస్‌ను అధ్యక్ష భవనం రద్దు చేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో దానిని పునరుద్ధరించారు. (రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top