ట్రంప్‌ దంపతులకు మోదీ ఘన స్వాగతం

Donald Trump India Tour President Trump Reached Ahmedabad Airport - Sakshi

అమెరికా అధిపతి తొలి రాకడ సందర్భంగా యావత్‌ భారతం ‘నమస్తే ట్రంప్‌’ అంటూ ఆహ్వానం పలుకుతోంది. అగ్రరాజ్యాన్ని పాలిస్తున్న ట్రంప్ దూకుడైన, కఠిన నిర్ణయాలు భారత్‌కు నష్టదాయకంగా పరిణమించడంతో ఆయన తాజా పర్యటన మనకు ఏమేరకు లాభిస్తుందని కొందరు లెక్కలు కడుతున్నారు! ఆయన పర్యటన భారత్‌-అమెరికా సంబంధాలను మేలిమలుపు తిప్పనుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. సతీసమేతంగా ఇక్కడికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు..36 గంటల తన పర్యటనలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూద్దాం!

అహ్మదాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్‌ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది.
(చదవండి : ఆ హోటల్లో ట్రంప్‌ విడిది.. ఒక రాత్రి ఖర్చు..)

22 కి.మీ. రోడ్‌ షో..
ఎయిర్‌పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
(చదవండి : మేడమ్‌ ఫస్ట్‌ లేడీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top