ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ

Dharavi fights back against Covid-19 pandemic - Sakshi

కోవిడ్‌ కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ధారావి

ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్‌ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.

డబ్ల్యూహెచ్‌ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్‌–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో  ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.  

సవాళ్లు
► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు.  ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం
► కమ్యూనిటీ టాయిలెట్స్‌ మీద ఆధారపడిన 80% ప్రజలు
► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్‌ వినియోగం
► స్ట్రీట్‌ ఫుడ్‌పై ఆధారపడిన అత్యధిక జనం

4 టీ ఫార్ములా
► ట్రేసింగ్‌
47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్‌ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు.

► ట్రాకింగ్‌
6 లక్షల మందిని స్క్రీన్‌ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్‌ కేసుకి 5 మందిని క్వారంటైన్‌కి తరలించారు.  

► టెస్టింగ్‌
13,500 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు

► ట్రీటింగ్‌
ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో  200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్‌ కేసులకు చికిత్స అందించారు.  స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్‌ హోమ్స్‌కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను క్వారంటైన్‌ హోమ్స్‌గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్‌ చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-09-2020
Sep 24, 2020, 06:12 IST
సాక్షి, అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 53,02,367 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా 72,838 టెస్టులు చేయగా,...
24-09-2020
Sep 24, 2020, 02:21 IST
ఐక్యరాజ్య సమితి: కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య...
23-09-2020
Sep 23, 2020, 22:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2 లక్షల 56 వేలు కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి.  గడచిన 24 గంటలలో...
23-09-2020
Sep 23, 2020, 21:14 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి...
23-09-2020
Sep 23, 2020, 18:10 IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం.
23-09-2020
Sep 23, 2020, 16:47 IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
23-09-2020
Sep 23, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,347  కరోనా పాజిటివ్ కేసులు...
23-09-2020
Sep 23, 2020, 09:21 IST
బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌...
23-09-2020
Sep 23, 2020, 09:10 IST
సాక్షి, శ్రీకాకుళం: ఆ యువకుడిది పేద కుటుంబం.. తండ్రి మరణించాడు.. అన్నయ్య, తల్లి కష్టపడి చదివించారు. తాను కూడా ఉపాధ్యాయ...
23-09-2020
Sep 23, 2020, 08:59 IST
హైదరాబాద్ : కోవిడ్‌–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ,...
23-09-2020
Sep 23, 2020, 05:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేళ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్‌ నిర్ధారణకు వచ్చినట్లు...
23-09-2020
Sep 23, 2020, 05:04 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు...
23-09-2020
Sep 23, 2020, 03:58 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24...
23-09-2020
Sep 23, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని...
23-09-2020
Sep 23, 2020, 03:33 IST
మాస్కో: కరోనా వైరస్‌ ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా స్పుత్నిక్‌ వీ తర్వాత మరో వ్యాక్సిన్‌ను...
22-09-2020
Sep 22, 2020, 21:26 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశంపై...
22-09-2020
Sep 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465.
22-09-2020
Sep 22, 2020, 19:26 IST
జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది?
22-09-2020
Sep 22, 2020, 17:56 IST
అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
22-09-2020
Sep 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top