సన్యాసం తీసుకుంటే కార్యకర్తల గతేంటి? | Department of Energy minister dk shiva kumar comments on H.D. Kumaraswamy | Sakshi
Sakshi News home page

సన్యాసం తీసుకుంటే కార్యకర్తల గతేంటి?

Mar 11 2016 9:22 AM | Updated on Sep 18 2018 8:28 PM

సన్యాసం తీసుకుంటే కార్యకర్తల గతేంటి? - Sakshi

సన్యాసం తీసుకుంటే కార్యకర్తల గతేంటి?

రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత లేదని ఇంధన శాఖ మంత్రి డి.కె. శివకుమార్ వెల్లడించారు.

బెంగళూరు: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత లేదని ఇంధన శాఖ మంత్రి డి.కె. శివకుమార్ వెల్లడించారు. వేసవిలో విద్యుత్ సమస్య ఎదురుకాకుండా ఇప్పటికే విద్యుత్ ను కొనుగోలు చేసినట్టు చెప్పారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. గురువారమిక్కడ కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన మంత్రి శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న అన్నీ మార్గాల ద్వారా ఇప్పటికే అవసరమైన మేరకు విద్యుత్ ను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 319 మెగావాట్ల విద్యుత్ కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన మాట వాస్తమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న విద్యుత్ ధర ఎక్కువగా ఉండటం వల్లనే ఈ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని వివరించారు. రైతులకు వ్యవకసాయ అవసరాల కోసం రోజుకు 7 గంటల పాటు నిరంతర విద్యుత్ అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. పరీక్షల సందర్భంలో కరెంటు కోతలు విధించరాదని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఇక కేపీసీసీ అధ్యక్ష రేస్ పదవిలో తాను లేనని, ప్రస్తుతం ఉన్న బాధ్యతలను పూర్తిస్ధాయి నిర్వర్తించడమే తన లక్ష్యమని తెలిపారు.
 
ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి. జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షడు హెచ్ డి కుమార స్వామిపై మంత్రి శివకుమార్ వంగ్యాస్త్రాలు సంధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కుమార్ స్వామి అంటున్నారని, ఆయన సన్యాసం తీసుకుంటే కార్యకర్తలు ఏమవుతారంటూ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్ అధికారంలోకి రాబోదని పరోక్షంగా అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement