జామియా విద్యార్థులపై క్రికెటర్‌ ఆందోళన | Country And I Concerned About Jamia Students, Tweets Irfan Pathan | Sakshi
Sakshi News home page

జామియా విద్యార్థులపై క్రికెటర్‌ ఆందోళన

Dec 16 2019 12:51 PM | Updated on Dec 16 2019 12:58 PM

Country And I Concerned About Jamia Students, Tweets Irfan Pathan - Sakshi

న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల పరిస్థితిపై భారత క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆందోళన వ్యక్తం చేశారసు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హింస చెలరేగింది. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మరీ తమను చితకబాదినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

‘రాజకీయ నిందారోపణలు ఎప్పుడూ ఉండేవే. కానీ జామియా విద్యార్థుల పరిస్థితి గురించే ఇప్పుడు నేను, మన దేశం ఆందోళన చెందుతోంది’ అని ట్వీట్‌ చేసిన ఇర్ఫాన్‌.. జామియా మిలియా, జామియా ప్రొటెస్ట్‌ అనే యాష్‌ట్యాగ్‌లు జోడించారు.

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో ఆందోళనకారులు నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు జెఎంఐ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడటంతో బలగాలు కూడా క్యాంపస్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలు తమను పట్ల దురుసుగా ప్రవర్తించాయని, కనీసం క్యాంపస్‌ పరిధిలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదని, తమ లైబ్రరీ, క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జెఎంఐని వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించేశారు.
చదవండి: చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement