
సాక్షి, చెన్నై : తమిళనాడుపై కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీ పెరుగుతోంది. గురువారం కొత్తగా 580 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,409కి చేరింది. ఇక ఈ రోజు ఇద్దరు చనిపోవడంతో మరణాల సంఖ్య 37కు పెరిగింది. ఇప్పటి వరకు 1,547 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 3,822 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(చదవండి : తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు)