
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌లను లాక్‌డౌన్ చేశారు. ఈ క్రమంలో 60 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులు విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారి అయ్యాయి. అంతేగాక 20 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలని.. అది కూడా షిఫ్ట్ రొటేషన్ బేసిస్‌లో పని చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్తగా ఏపీ, తెలంగాణ భవన్‌కు అతిథులేవరు రాకూడదని కూడా సూచించింది. డ్రెవర్లకు సైతం ఫోన్ చేసి పలిస్తేనే విధుల్లోకి రావాలంటూ ఆదేశాలు జారి అయ్యాయి. కాగా క్యాంటీన్లో పార్సిల్లపై కూడా నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.